ఏపీలో కొత్తగా 12,926 కరోనా పాజిటివ్ కేసుల నమోదు
- గత 24 గంటల్లో 43,763 కరోనా టెస్టులు
- విశాఖ జిల్లాలో 1,959 కొత్త కేసులు
- చిత్తూరు జిల్లాలో 1,566 కేసులు
- రాష్ట్రంలో ఆరుగురి మృతి
- 73 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
అదే సమయంలో 3,913 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మృత్యువాత పడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,538కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,66,194 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,78,513 మంది ఆరోగ్యవంతులయ్యారు. చికిత్స పొందుతున్న వారి సంఖ్య 73,143కి పెరిగింది.