Nagashourya: నాగశౌర్య హీరోగా 'కృష్ణ వ్రింద విహారి' .. ఫస్టులుక్ రిలీజ్

Naga Shaurya with Anish Krishna movie Krishna Vrinda Vihari

  • నాగశౌర్య నుంచి మరో లవ్ స్టోరీ 
  • సొంత బ్యానర్ నుంచి వస్తున్న మరో మూవీ 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
  • కథానాయికగా షిర్లే సెటియా

నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. నాగశౌర్య సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. తాజాగా ఈ సినిమాకి 'కృష్ణ వ్రింద విహారి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజున నాగశౌర్య పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఆయన ఫస్టులుక్ ను వదిలారు.
 
'కృష్ణ వ్రింద విహారి' అనే టైటిల్ ను డిజైన్ చేయించిన తీరు చూస్తే కృష్ణ .. వ్రింద .. విహారి అనే ముగ్గురి మధ్య నడిచే ప్రేమకథ అనే విషయం అర్థమవుతుంది. అంటే ఒక హీరో .. ఇద్దరు హీరోయిన్ల చుట్టూ ఈ కథ నడుస్తుందన్న మాట. సంప్రదాయబద్ధమైన కుటుంబానికి చెందిన కుర్రాడిలా నాగశౌర్య డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడని పోస్టర్ ను బట్టి తెలుస్తోంది.

నాగశౌర్య జోడీగా షిర్లే సెటియా కనిపించనుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కొంతకాలంగా నాగశౌర్య వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. ఆల్రెడీ రెండు మూడు ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. మరి వీటిలో ఈ ఏడాది ఆయనకి ఏ సినిమా హిట్ ఇస్తుందో చూడాలి.

Nagashourya
Shirley
Krishna Vrinda Vihari Movie
  • Loading...

More Telugu News