Raviteja: సినీ హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మిపై కేసు నమోదు

Police case filed on actor Raviteja mother
  • తూర్పుగోదావరి జిల్లా రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేశారని కేసు
  • ఆమెతో పాటు సంజయ్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు
  • ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్న రవితేజ

టాలీవుడ్ స్టార్ రవితేజ తల్లి రాజ్యలక్ష్మిపై పోలీసు కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేసిన ఘటనలో ఈ కేసు నమోదైంది. ఆమెతో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాలువ, తూము నిర్మాణ పనులను ధ్వంసం చేశారంటూ ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు రవితేజ విషయానికి వస్తే... 'ఖిలాడి', 'రామారావు' చిత్రాల షూటింగులతో ఆయన బిజీగా ఉన్నారు.

  • Loading...

More Telugu News