Pooja Hegde: ముంబయిలో కొత్త ఇంట్లో ప్రవేశించిన పూజా హెగ్డే

Pooja Hegde house warming pic
  • ముంబయిలో పూజా హెగ్డే లగ్జరీ ఇల్లు
  • ఏడాది కాలంగా నిర్మాణం
  • కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం
  • సోషల్ మీడియాలో ఫొటో

దక్షిణాది భామ పూజా హెగ్డే ముంబయిలో తన కలల ఇంటిని నిర్మించుకోవడం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు గృహ ప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. చేతిలో కొబ్బరికాయతో కుటుంబ సభ్యుల నడుమ పూజా హెగ్డే దర్శనమిచ్చింది. గత ఏడాది కాలంగా ముంబయిలో పూజా హెగ్డే కొత్త ఇల్లు నిర్మాణం జరుపుకుంది. గతంలో తన కొత్త ఇంటికి సంబంధించిన పలు ఫొటోలను ఈ కన్నడ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

  • Loading...

More Telugu News