Chiranjeevi: కృష్ణంరాజు గారూ.. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి: చిరంజీవి

Chiranjeevi greets Krishnam Raju on his birthday
  • ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కృష్ణంరాజు
  • ప్రతి రంగంలో తనదైన ముద్ర వేశారంటూ చిరంజీవి కితాబు
  • హ్యాపీ బర్త్ డే కృష్ణంరాజుగారు అంటూ విషెస్
రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'సోదర సమానుడు, తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి రెబెల్ స్టార్, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా అడుగిడిన ప్రతి రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన శ్రీ కృష్ణంరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని పేర్కొంటూ.. 'హ్యాపీ బర్త్ డే కృష్ణంరాజు గారు' అంటూ విషెస్ తెలిపారు.
Chiranjeevi
Krishnam Raju
Birthday
Tollywood

More Telugu News