తెలంగాణలో కొత్తగా 2,447 కరోనా పాజిటివ్ కేసుల వెల్లడి
- గత 24 గంటల్లో 80,138 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 1,112 కొత్త కేసులు
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 22,197 మందికి చికిత్స
అదే సమయంలో 2,295 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 4,060కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,11,656 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,85,399 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,197 మంది చికిత్స పొందుతున్నారు.