తెలంగాణ పోలీసు శాఖపై కరోనా పంజా.. కరోనా బారిన పడ్డ వందలాది మంది పోలీసులు!
- థర్డ్ వేవ్ లో దాదాపు 500 మంది పోలీసులకు కరోనా
- అందరూ బూస్టర్ డోసులు తీసుకోవాలని ఆదేశించిన ఉన్నతాధికారులు
- పీఎస్ కు ఫిర్యాదుదారుడు ఒక్కడే రావాలని ఆంక్షలు
హైదరాబాదులోని మూడు కమిషనరేట్లలో పోలీసులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్లకు ఎక్కువ మంది రాకూడదని, కేవలం ఒక్కరు మాత్రమే రావాలని ఆంక్షలు విధించారు. హోమ్ గార్డ్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారుల వరకు అందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.