pf pension: ప్రతి నెలా చివరి రోజునే జమ కానున్న ఈపీఎఫ్ పింఛను

EPF PENSION GET LAST DATE OF EVERY MONTH
  • హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ ఆదేశం
  • బ్యాంకులకు ముందుగానే బిల్లులు
  • ప్రస్తుతం ప్రతీ నెలా 5-10 తేదీ మధ్యలో పెన్షన్
ఉద్యోగుల భవిష్యనిధి నుంచి పింఛను పొందుతున్న వారికి ఊరట కల్పించే నిర్ణయాన్ని హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ విశాల్ అగర్వాల్ తీసుకున్నారు. ప్రతి నెలా చివరి తేదీన (పనిదినం) లబ్దిదారుల ఖాతాల్లో పింఛను జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈపీఎఫ్ 95 పథకం కింద కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు పదవీ విరమణ తర్వాత లేదా 58 ఏళ్లు నిండిన తర్వాత నుంచి పెన్షన్ కు అర్హులు. ప్రతి నెలా పింఛను 5-10 తేదీల మధ్యలో బ్యాంకులు జమ చేస్తున్నాయి. దీంతో పింఛనుపై ఆధారపడిన వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది.

ఈ విషయం పీఎఫ్ కమిషనర్ దృష్టికి వచ్చింది. దీంతో ప్రతి నెలా చివరి తేదీనే పింఛను అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకు వీలుగా రెండు రోజుల ముందుగానే బిల్లులను బ్యాంకులకు ఈపీఎఫ్ వో పంపించనుంది. దాంతో చెప్పిన తేదీన ఖాతాల్లో పింఛను జమ చేయడం బ్యాంకులకు వీలు పడుతుంది.
pf pension
laste date
epfo

More Telugu News