Prabhas: 20 కోట్ల ఖర్చుతో 'సలార్' కోసం ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్!
- ముగింపు దశలో 'సలార్'
- యాక్షన్ ప్రధానంగా సాగే కథ
- కథానాయికగా శ్రుతి హాసన్
- ఐటమ్ సాంగ్ లో మెరవనున్న శ్రద్ధా కపూర్
ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాధే శ్యామ్' సిద్ధంగా ఉంది. కరోనా ప్రభావం తగ్గిన తరువాత థియేటర్లలో దిగిపోవడానికి ఈ సినిమా రెడీగా ఉంది. ఈ సినిమాలో రొమాంటిక్ హీరోగా కనిపించే ప్రభాస్, ఆ తరువాత సినిమా అయిన 'సలార్'లో మాస్ యాక్షన్ ను అదరగొట్టనున్నట్టు చెబుతున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, మాస్ యాక్షన్ హీరోగా ప్రభాస్ విశ్వరూపాన్ని చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం 20 కోట్ల ఖర్చుతో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారట. ఈ సినిమాకి అది హైలైట్ కానుందని అంటున్నారు. ప్రీ క్లైమాక్స్ గా ఈ సినిమాలో ఆ ఎపిసోడ్ వస్తుందని చెబుతున్నారు.
ప్రశాంత్ నీల్ ఈ యాక్షన్ ఎపిసోడ్ ను డిజైన్ చేయించిన తీరు చూస్తే, హాలీవుడ్ సినిమాలు గుర్తుకు వస్తాయని అంటున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఒక మాస్ మసాలా సాంగ్ కూడా ఉందని చెబుతున్నారు. ఆ స్పెషల్ సాంగ్ లో శ్రద్ధా కపూర్ మెరవనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.