Chittoor District: చిత్తూరు జిల్లా పశువుల పండుగలో విషాదం.. మద్యం మత్తులో పొట్టేలుకు బదులు వ్యక్తి తల నరికివేత

man beheaded instead of sheep in Chittoor dist
షార్ట్స్‌లో చూడండి
చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలోని వలసపల్లెలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆనవాయితీగా వస్తున్న ఆచారంలో భాగంగా గ్రామంలో పశువుల పండుగ నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలి ఇచ్చేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో బలి కోసం సిద్ధం చేసిన పొట్టేలును సురేశ్ (35) అనే వ్యక్తి కదలకుండా పట్టుకోగా, మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పొట్టేలు తలకు బదులుగా దానిని పట్టుకున్న సురేశ్ తలపై వేటేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Chittoor District
Madanapalle
Cattle Festival
Andhra Pradesh

More Telugu News