మోదీ హత్యకు కాంగ్రెస్ కుట్ర.. పంజాబ్ సీఎంను అరెస్ట్ చేయండి: అసోం ముఖ్యమంత్రి డిమాండ్
- కాంగ్రెస్ కుట్రలో పంజాబ్ సీఎం భాగం
- మోదీ హత్యకు కుట్ర జరుగుతోందని ఈ నెల 2నే పంజాబ్ పోలీసులకు సమాచారం
- ఓ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌లో కాంగ్రెస్ కుట్ర బహిర్గతం
- కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు కూడా దీనిని బలపరుస్తున్నాయి
ప్రధాని హత్యకు కుట్ర జరగబోతోందని జనవరి 2వ తేదీనే పంజాబ్ పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని, అయినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఓ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌లో కాంగ్రెస్ కుట్ర బయటపడిందని, అలాగే, ఈ ఘటన అనంతరం కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా కుట్ర కోణాన్ని బహిర్గతం చేస్తున్నాయని అసోం సీఎం అన్నారు.