మమ్మల్ని క్షమించండి: బాలయ్య అభిమానులకు డైరెక్టర్ బోయపాటి సారీ
- 'అఖండ' సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర యూనిట్
- కరోనా నేపథ్యంలో అభిమానులను పిలవని యూనిట్
- ఫ్యాన్స్ బాగుండాలనే పిలవలేదన్న బోయపాటి
ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ, అభిమానులను ఈ ఈవెంట్ కు పిలవలేకపోయినందుకు క్షమించాలని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమయిందని... సక్సెస్ మీట్ కు రమ్మంటే అభిమానులు ఏమాత్రం ఆలోచించకుండా వచ్చేస్తారని, వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఈవెంట్ కు పిలవలేదని చెప్పారు. ఫ్యాన్స్ బాగుండాలనే వారిని పిలవలేదని అన్నారు. ఈవెంట్ కు పిలవనందుకు తమను క్షమించాలని కోరారు.