YS Sharmila: ముందు ఇంట గెలవండి దొరా: షర్మిల

Sharmila fires on KCR
  • తమిళనాడు, కేరళ సీఎంలతో మంతనాలు చేయడానికి మీకు సమయం ఉంది
  • చనిపోతున్న రైతులను ఆదుకోవాలనే సోయి లేదు
  • ముందు ఇక్కడి రైతుల చావులను ఆపండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైసీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి మండిపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి, కేరళ సీఎంతో మంతనాలు చేయడానికి, బీహార్ ప్రతిపక్ష నేతతో కలిసి దోస్తానా చేయడానికి, దేశ రాయకీయాల మీద చర్చ చేయడానికి మీకు సమయం ఉంది తప్ప... చనిపోతున్న రైతులను ఆదుకోవాలనే సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలవండి దొరా అని అన్నారు.

మీ రైతు వారోత్సవాల సాక్షిగా బ్యాంకుల ఆగడాలకు రైతులు బలైపోతున్నది మీకు కనపడుతోందా దొరా? అని ప్రశ్నించారు. పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకునే  రైతులు, వడ్డీ వ్యాపారుల చేతుల్లో నష్టపోయిన రైతులు మీకు కనపడరని విమర్శించారు. ముందు ఇక్కడి రైతుల చావులను ఆపి ఆ తర్వాత దేశాన్ని ఏలండి దొరా అన్నారు షర్మిల.
YS Sharmila
YSRTP
KCR
TRS

More Telugu News