Andhra Pradesh: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

AP register 3205 corona cases in 24 hours
  • 24 గంటల్లో 3,205 కేసుల నమోదు
  • విశాఖ జిల్లాలో అత్యధికంగా 695 కేసులు
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10,119
ఏపీలో కరోనా థర్డ్ వేవ్ పంజా విసురుతోంది. పాజిటివ్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,205 మంది కరోనా బారిన పడ్డారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 695 కేసులు నమోదు కాగా.. కడప జిల్లాలో అత్యల్పంగా 42 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 281 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 20,87,879కి చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా నుంచి 20,63,255 మంది కోలుకోగా... 14,505 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

More Telugu News

Andhra Pradesh
Corona Virus
Updates