నైట్ కర్ఫ్యూ అమలును వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం
- ఏపీలో కరోనా తీవ్రం
- ఇటీవల నైట్ కర్ఫ్యూ ప్రకటన చేసిన ప్రభుత్వం
- సంక్రాంతి సీజన్ నేపథ్యంలో ఉత్తర్వుల సవరణ
- ఈ నెల 18 నుంచి రాత్రి పూట కర్ఫ్యూ
దీనిపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే నైట్ కర్ఫ్యూ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. మూడో దశ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. మాస్కులు ధరించకపోతే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా కట్టడిలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు.