ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చలకు కాసేపట్లో అమరావతికి ఆర్జీవీ
- ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరల వివాదం
- ఏపీ ప్రభుత్వం ఆర్జీవీకి ఆహ్వానం
- మధ్యాహ్నం 12.30 గంటలకు భేటీ
సినిమా టికెట్ల ధరల వివాదంపై తమతో సమావేశానికి రావాలంటూ పేర్ని నాని నుంచి ఆహ్వానం అందడంతో ఈ రోజు హైదరాబాద్ నుంచి అమరావతి సచివాలయానికి ఆర్జీవీ వెళ్తున్నారు. సచివాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఇరువురు భేటీ కానున్నారు. కాసేపట్లో ఆర్జీవీ గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా అమరావతి సచివాలయానికి వెళ్తారు.