నల్గొండ జిల్లాలో నరబలి కలకలం.. గుడి వద్ద మొండెం లేని తల స్వాధీనం
- విరాట్ నగర్ మైసమ్మ ఆలయం వద్ద మొండెం లేని తల
- నరబలి ఇచ్చి ఉంటారని అనుమానం
- ఆలయానికి వెళ్లేందుకు భయపడుతున్న భక్తులు
ఆలయం వద్ద తలను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తర్వాత ఆలయానికి వెళ్లేందుకు భక్తులు భయపడుతున్నారు.