Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయంలో 90 శాతం మంది సిబ్బందికి కరోనా

90 percent staff in kishan reddy office tested positive
  • ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి
  • లక్షణాలు లేవని నిర్లక్ష్యంగా ఉండొద్దన్న కేంద్రమంత్రి
  • 15-18 ఏళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు టీకాలు వేయించాలని సూచన
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయంలోని 90 శాతం మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నిన్న హైదరాబాద్‌ నారాయణగూడలోని కేశవ స్మారక విద్యా సంస్థల క్రీడా మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి విజేతలకు బహుమతులు అందించారు.

అనంతరం మాట్లాడుతూ.. తన కార్యాలయంలోని 90 శాతం మంది అధికారులు, సిబ్బంది కరోనా బారినపడినట్టు చెప్పారు. లక్షణాలు లేవని నిర్లక్ష్యంగా ఉండొద్దని  ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 15-18 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా టీకాలు ఇప్పించాలన్నారు. దేశభక్తి, జాతీయ భావం ఉట్టిపడేలా ముగ్గులు వేసినవారు వాటి వద్ద ఫొటోలు తీసుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే ధ్రువీకరణ పత్రం వస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.
Kishan Reddy
COVID19
Corona Vaccine

More Telugu News