బండ్ల గణేశ్ కు మరోసారి కరోనా పాజిటివ్
- మూడోసారి కరోనా బారినపడిన బండ్ల గణేశ్
- ఢిల్లీలో మూడ్రోజులు ఉన్నానని వెల్లడి
- కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు వివరణ
- ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానంటూ ట్వీట్
అయితే, గత మూడ్రోజులుగా ఢిల్లీలో ఉన్నానని, ఈ సాయంత్రం కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని బండ్ల గణేశ్ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లరాదని సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.