మహాప్రస్థానంలో ముగిసిన రమేశ్ బాబు అంత్యక్రియలు
- కాలేయ సంబంధ అనారోగ్యంతో రమేశ్ బాబు మృతి
- సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో తీరని శోకం
- మహేశ్ బాబు ఇంటి ముందు నుంచే అంతిమయాత్ర
- రమేశ్ బాబుకు అంత్యక్రియలు నిర్వహించిన కుమారుడు
అంతిమయాత్రకు ముందు పద్మాలయా స్టూడియోస్ లో తనయుడి మృతదేహాన్ని చూసి కృష్ణ కన్నీరుమున్నీరయ్యారు. కాగా, కరోనా సోకడంతో మహేశ్ బాబు తన సోదరుడ్ని కడసారి చూసేందుకు వీల్లేకపోయింది. మహేశ్ బాబు ఇంటి ముందు నుంచే అంతిమయాత్ర సాగింది. రమేశ్ బాబు కొంతకాలంగా లివర్ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడవడంతో వారి వేదన అంతాఇంతా కాదు.