Satyaraj: 'బాహుబలి' కట్టప్ప సత్యరాజ్ కు కరోనా.. పరిస్థితి విషమం!

Bahubali fame Satyaraj tests positive for Corona
  • ఇటీవల కరోనా బారిన పడిన సత్యరాజ్
  • రాత్రి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలింపు
  • ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం
ప్రముఖ సినీనటుడు సత్యరాజ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని అమింజిక్కరైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్నారు.

అయితే నిన్న రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్ గానే ఉన్నట్టు సమాచారం. ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు బులెటిన్ విడుదల చేయాల్సి ఉంది.

మరోవైపు తమిళ సినీపరిశ్రమలో ఇప్పటికే ఎందరో కరోనా బారిన పడ్డారు. కమలహాసన్, అరుణ్ విజయ్, వడివేలు, మీనా, త్రిష తదితరులు కరోనాకు గురయ్యారు. వీరిలో ఇప్పటికీ మీనా, త్రిష, అరుణ్ విజయ్ చికిత్స పొందుతున్నారు. టాలీవుడ్ లో సైతం పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
Satyaraj
Tollywood
Kollywood
Corona Virus

More Telugu News