రిస్క్ వద్దని చెప్పిన 'సార్' .. ఆగిన షూటింగ్?

Sir movie shooting stopped due to Corona
షార్ట్స్‌లో చూడండి
తమిళంలో వరుస సినిమాలతో ధనుశ్ బిజీగా ఉన్నాడు. అయినా నేరుగా ఒక తెలుగు సినిమా చేసే సమయం కోసం ఆయన ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. మొత్తానికి వెంకీ అట్లూరితో కలిసి ఒక ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు. సితార - ఫార్చ్యూన్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది.

కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. అయితే కరోనా విరుచుకుపడుతుండటంతో పరిస్థితులు చకచకా మారిపోతున్నాయి. పూర్తిస్థాయి లాక్ డౌన్ పడే అవకాశాలు కూడా లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదనే అభిప్రాయానికి ధనుశ్ వచ్చాడట.

ఈ సినిమా మేకర్స్ కి తన అభిప్రాయం చెప్పాడనీ, వాళ్లు కూడా అదే నిర్ణయాన్ని వ్యక్తం చేయడంతో, ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగును ఆపేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత షూటింగు మొదలుపెడతారన్న మాట.  
Go Back to Shorts
Dhanush
Venky Atluri
Sir Movie

More Telugu News