జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కించుకున్న కడప జిల్లా

  • నేషనల్ వాటర్ అవార్డు-2020ని దక్కించుకున్న కడప జిల్లా
  • నీటి సంరక్షణ కోసం చేసిన కృషికి అవార్డు
  • 2018 నుంచి ఈ అవార్డులు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. జాతీయ జల అవార్డులు-2020లో మొత్తం 11 విభిన్న విభాగాలకు గాను 57 అవార్డులను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. ఈ అవార్డుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం కడప జిల్లాకు మాత్రమే అవార్డు వచ్చింది. దక్షిణాది రాష్ట్రం కేరళలోని తిరువనంతపురం జిల్లాకు తొలి స్థానం దక్కగా... ఏపీలోని కడప జిల్లాకు రెండో స్థానం దక్కింది.

నీటి సంరక్షణ కోసం కృషి చేసిన జిల్లాలు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, గృహ సంక్షేమ సంఘాలు, మతపరమైన సంఘాలు, పరిశ్రమలు, నీటి వినియోగ సంఘాలకు నేషనల్ వాటర్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందిస్తోంది. 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందిస్తోంది.

Kadapa District
National water awards

More Telugu News