పదవీ విరమణ వయసు పెంపు ఊహించలేదు... మేం అడగకుండానే ఇళ్ల స్థలాలు ప్రకటించారు: బొప్పరాజు హర్షం
- ఉద్యోగులకు ఫిట్ మెంట్ ప్రకటించిన సీఎం జగన్
- ఇతర అంశాల్లోనూ ప్రకటన
- సీఎం జగన్ ప్రకటనను స్వాగతించిన బొప్పరాజు
- సీఎం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంస
ఉద్యోగ సంఘాలు అడగకపోయినా ఇంటి స్థలాల విషయంలో నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఉద్యోగుల సొంతింటి కలను నిజం చేస్తున్నారని తెలిపారు. సీఎం నోట ఇళ్ల స్థలాల ప్రకటన వస్తుందని తాము అనుకోలేదని చెప్పారు. పెండింగ్ డీఏలపై సీఎం నిర్ణయం సంతోషదాయకమని అన్నారు.
హెల్త్ కార్డుల సమస్యను రెండు వారాల్లోపు పరిష్కరిస్తామంటూ టైమ్ లైన్ విధించారని, తమతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 1వ తేదీ నుంచే జీతాలు పెంపుదల చేయడం శుభపరిణామం అని బొప్పరాజు పేర్కొన్నారు. సీఎం ఎదుట తాము ప్రస్తావించిన ప్రధాన సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని బొప్పరాజు పేర్కొన్నారు.