Manchu Lakshmi: టాలీవుడ్ సెలబ్రిటీ మంచు లక్ష్మికి కరోనా

Manchu Lakshmi tested corona positive
  • మళ్లీ మొదలైన కరోనా ఉద్ధృతి
  • తనకు పాజిటివ్ వచ్చిందన్న మంచు లక్ష్మి
  • సోషల్ మీడియా ద్వారా వెల్లడి

టాలీవుడ్ లోనూ మళ్లీ కరోనా కేసులు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు తనకు కరోనా సోకిందని వెల్లడించారు. అటు, ప్రముఖ నటి, నిర్మాత, టీవీ ప్రజెంటర్ మంచు లక్ష్మి కూడా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా నిర్ధారణ అయిందని, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆమె వెల్లడించారు.

రెండేళ్లుగా దోబూచులాడుతున్న కరోనా బూచోడు ఎట్టకేలకు తనను పట్టుకున్నాడని మంచు లక్ష్మి సరదాగా వ్యాఖ్యానించారు. తాను నేర్చుకున్న 'కలరి' పోరాటవిద్యను కరోనాపై ప్రయోగిస్తానని చమత్కరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ఇంటి వద్దనే ఉంటూ సురక్షితంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News