Telangana: తెలంగాణలో మళ్లీ భారీగా నమోదవుతున్న కరోనా రోజువారీ కేసులు

Huge number of corona positive cases in Telangana
  • గత 24 గంటల్లో 54,534 కరోనా టెస్టులు
  • 1,913 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,214 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 7,847 మందికి చికిత్స

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 54,534 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 1,913 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,214 మందికి పాజిటివ్ గా తేలింది. రంగారెడ్డి జిల్లాలో 213, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 161 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 232 మంది కోలుకోగా, ఇద్దరు మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటిదాకా 4,036 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,87,456 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,75,573 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 7,847కి పెరిగింది.

  • Loading...

More Telugu News