ఒకే విమానంలో వచ్చిన 125 మందికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కేసులు మళ్లీ అమాంతం పెరుగుతున్నాయి. దీంతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా బెంబేలెత్తిస్తోంది. దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభమయిందని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది. పరిస్థితి రోజురోజుకూ విషమిస్తున్న తరుణంలో మరో కలకలం రేగింది. ఇటలీ నుంచి పంజాబ్ లోని అమృత్ సర్ కు ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన 179 మందిలో 125 మందికి కరోనా నిర్ధారణ అయింది.

దీంతో వీరందరినీ ఐసొలేషన్ లో ఉంచారు. ఇదే సమయంలో వీరందరి శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. వీరిలో ఒమిక్రాన్ బాధితులు ఎంతమంది ఉన్నారనే విషయం జీనోమ్ సీక్వెన్సింగ్ లో తేలనుంది. రిస్క్, ఎట్-రిస్క్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే క్వారంటైన్ కు పంపుతున్నారు.

Air India
125 Passengers
Corona Positive

More Telugu News