Ram Gopal Varma: అల్లు అర్జున్ పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు

Ram Gopal Varma praises Allu Arjun
  • బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన 'పుష్ప'
  • బాలీవుడ్ లో సైతం రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు
  • 'పుష్ప'ను జాతీయ సినిమాగా నిలిపినందుకు థ్యాంక్స్ అన్న ఆర్జీవీ
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. బాలీవుడ్ లో సైతం సత్తా చాటుతూ రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ తనకు ఇష్టమైన హీరో అని ఆర్జీవీ ఎన్నో సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా 'పుష్ప' హిట్ అయిన నేపథ్యంలో ఆయన మరోసారి స్పందించారు.

'హేయ్ అల్లు అర్జున్... అంతిమ్, సత్యమేవజయతే 2, 83 వంటి బాలీవుడ్ సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ... ప్రాంతీయ సినిమా అయిన 'పుష్ప'ను జాతీయ సినిమాగా మార్చినందుకు ధన్యవాదాలు' అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.
Ram Gopal Varma
Allu Arjun
Pushpa
Tollywood

More Telugu News