Telangana: తెలంగాణలో ఈరోజు కూడా పెరిగిన కరోనా కేసులు

1520 new corona cases found in Telangana
  • గత 24 గంటల్లో 1,520 మందికి కరోనా పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న వారు 209 మంది
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,168
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తెలంగాణలో వరుసగా రెండో రోజు కూడా కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,531 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా వీరిలో 1,520 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,85,543కి చేరుకుంది.

ఇదే సమయంలో ఒకరు మృతి చెందగా... 209 మంది కోలుకున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మృతుల సంఖ్య 4,034కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి 6,75,341 మంది కోలుకున్నారు.

పోతే, రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 9.51 శాతంగా ఉంది. మరో 7,039 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు గత 24 గంటల్లో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన 247 మందికి ఈరోజు ఎయిర్ పోర్టులో టెస్టులు నిర్వహించారు.

Telangana
Corona Virus
Updates

More Telugu News