Andhra Pradesh: ఏపీలో మళ్లీ కరోనా ఉద్ధృతి.. నిన్నటి కంటే పెరిగిన కేసులు!

Corona cases in AP increasing again
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న 334 కొత్త కేసులు నమోదు కాగా... గత 24 గంటల్లో 434 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు నమోదు కాగా.. ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా 7 కేసులు నిర్ధారణ అయ్యాయి. అయితే ఒక్క కరోనా మరణం కూడా సంభవించకపోవడం సంతోషించదగ్గ విషయం.

ఇదే సమయంలో 102 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,78,376కు చేరుకుంది. ఇప్పటి వరకు 20,62,029 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 14,499 మంది కరోనా వల్ల మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,848 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News