ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

CM YS Jagan Delhi tour concludes
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఏపీకి తిరిగొచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇవాళ కూడా ఆయన బిజీగా గడిపారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర సమాచార ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లతో వరుసగా భేటీ అయ్యారు. సీఎం జగన్ నిన్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాలతో సమావేశం కావడం తెలిసిందే.
Go Back to Shorts
CM Jagan
Delhi Tour
Narendra Modi
Nirmala Sitharaman
Nitin Gadkari
Andhra Pradesh

More Telugu News