సఫారీ పేసర్ల వికెట్ల వేట... తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 202 ఆలౌట్
- జోహాన్నెస్ బర్గ్ లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా
- పేసర్లకు సహకరిస్తున్న వాండరర్స్ పిచ్
- 4 వికెట్లు తీసిన మార్కో జాన్సెన్
- మూడేసి వికెట్లు పడగొట్టిన రబాడా, ఒలీవియర్
టీమిండియా బ్యాటింగ్ చూస్తే... తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ 50 పరుగులు నమోదు చేశాడు. లోయరార్డర్ లో రవిచంద్రన్ అశ్విన్ 46 పరుగులు చేయకుంటే భారత జట్టు ఇంకా తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 26, హనుమ విహారి 20, పంత్ 17 పరుగులు చేశారు.