'లైగర్' కాంబో మరోసారి రిపీట్ అవుతుందట!
- ముగింపు దశలో 'లైగర్'
- బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ
- ఆగస్టు 25వ తేదీన విడుదల
- మరో సినిమా చేసే ఛాన్స్
పూరి - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్టుపై ఉండటం వలన ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట. పూరి టేకింగ్ పై విజయ్ కి అవగాహన పెరిగితే, విజయ్ లో తాను చూపించవలసిన మాస్ హీరోయిజం మరింత ఉందని పూరి భావిస్తున్నాడట.
అందువలన ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. 'లైగర్'ను ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తరువాత శివ నిర్వాణ సినిమాను పూర్తి చేసి, మళ్లీ పూరితో కలిసి విజయ్ దేవరకొండ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.