Jogi Ramesh: హీరో సంపూర్ణేశ్ బాబుతో కలిసి జుంబా డ్యాన్స్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్

YCP MLA Jogi Ramesh performs Zumba Dance with hero Sampoornesh Babu
  • ఇబ్రహీంపట్నంలో జుంబా డే కార్యక్రమం
  • ఈవెంట్ ను ఏర్పాటు చేసిన తేజాస్ ఎలైట్ సంస్థ
  • హాజరైన ఎమ్మెల్యే జోగి రమేశ్, హీరో సంపూర్ణేశ్ బాబు
  • నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
విజయవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నం వద్ద జుంబా డే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ కూడా డ్యాన్స్ చేయడం విశేషం. టాలీవుడ్ హీరో సంపూర్ణేశ్ బాబుతో కలిసి ఆయన జుంబా డ్యాన్స్ చేశారు. తేజాస్ ఎలైట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.

యువతను జుంబా డ్యాన్స్ పట్ల ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే జోగి రమేశ్, హీరో సంపూ వేదికపై ఉత్సాహంగా కాలు కదిపారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఇలాంటి ఫిట్ నెస్ ఈవెంట్లు మరిన్ని నిర్వహించాలని, జుంబా డ్యాన్స్ వంటి ఫిట్ నెస్ ఎక్సర్ సైజులను యువత క్రమం తప్పకుండా చేయాలని ఎమ్మెల్యే జోగి రమేశ్ పిలుపునిచ్చారు.
Jogi Ramesh
Zumba Dance
Sampoornesh Babu
Vijayawada
YSRCP

More Telugu News