Varla Ramaiah: మంత్రి బొత్స కాళ్లకు ఐఏఎస్ అధికారి మొక్కడంపై వర్ల రామయ్య స్పందన

Varla Ramaiah reacts to IAS Officer falling at the feet of minister Botsa
  • విజయనగరం జిల్లాలో ఘటన
  • మంత్రి బొత్స కాళ్లకు మొక్కిన జేసీ
  • నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైనం
  • ఐఏఎస్ అధికారి తీరుపై విమర్శలు

నూతన సంవత్సరాది సందర్భంగా ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లకు విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ మొక్కడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. ఓ ఐఏఎస్ అధికారి ఒక రాజకీయనేత కాళ్లకు నమస్కరించడం అవమానకరం అని పేర్కొన్నారు.

సదరు ఐఏఎస్ అధికారి చర్య చూస్తుంటే జిల్లా యంత్రాంగం మొత్తం మంత్రికి దాసోహం అంటోందని భావించాలా? ఈ చర్యను ఐఏఎస్ అధికారుల సంఘం తక్షణమే ఖండించాలి కదా? వాళ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News