తెలంగాణలో కొనసాగుతున్న ఒమిక్రాన్ కలకలం... కొత్తగా 12 మందికి పాజిటివ్

  • రాష్ట్రంలో 79కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు
  • వారిలో ఒమిక్రాన్ నుంచి కోలుకున్న 27 మంది
  • రోజువారీ కరోనా కేసుల్లో పెరుగుదల
  • గత 24 గంటల్లో 317 కొత్త కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 217 మందికి పాజిటివ్
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు వెల్లడయ్యాయి. దాంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 79కి పెరిగింది. వారిలో 27 మంది కోలుకున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య వర్గాలు తెలిపాయి.

ఇక, రోజువారీ కరోనా కేసుల విషయానికొస్తే... గడచిన 24 గంటల్లో 28,886 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 317 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 217 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 26, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 232 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,82,215 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,74,453 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,733 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,029కి పెరిగింది.

Omicron
Positive Cases
Telangana
Corona Virus
Today Cases

More Telugu News