సంపూ హీరోగా 'మిస్టర్ బెగ్గర్'
- సంపూ హీరోగా 'మిస్టర్ బెగ్గర్'
- హాస్య ప్రధానంగా సాగే కథ
- దర్శకుడిగా జనార్దన్ పరిచయం
- త్వరలో రెగ్యులర్ షూటింగ్
విభిన్నమైన కథాకథనాలతో కూడిన ఒక సినిమాను గురురాజ్ - కార్తీక్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా జనార్దన్ పరిచయమవుతున్నాడు. రోహిత్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాకి, 'మిస్టర్ బెగ్గర్' అనే టైటిల్ ను సెట్ చేశారు. తాజాగా ఈ టైటిల్ తో కూడిన సంపూ ఫస్టు లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
'మిస్టర్ బెగ్గర్' గా కూడా సంపూ చాలా స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు. 'వీడు చిల్లరడగడు' అనే క్యాప్షన్ చూస్తేనే ఈ సినిమా, నవ్వుల రసంతో సాగిపోతుందనే విషయం అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళుతోంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
.