ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సౌరవ్ గంగూలీ

Sourav Ganguly discharged from hospital
  • కొన్నిరోజుల కిందట కరోనా బారినపడిన గంగూలీ
  • ఈ నెల 28న కోల్ కతాలో ఆసుపత్రిలో చేరిక
  • పూర్తిగా కోలుకున్న వైనం
  • మరికొన్నిరోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్
దాదా అభిమానులకు శుభవార్త! బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కోల్ కతాలోని వుడ్ లాండ్స్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నుంచి ఆయన ఇవాళ డిశ్చార్జి అయ్యారు. తన వాహనంలో నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. గంగూలీ వైద్యుల సలహాపై మరికొన్నిరోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండనున్నారు. గంగూలీ ఈ నెల 28న కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ఆసుపత్రిలో చేరారు. కొన్ని నెలల కిందటే గంగూలీకి గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ నిర్వహించడం తెలిసిందే.
Go Back to Shorts
Sourav Ganguly
Discharge
Woodlands Hospital
Corona Virus
Kolkata
BCCI
Cricket
India

More Telugu News