ఏపీలో కొత్తగా 130 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

  • చిత్తూరు జిల్లాలో 18 మందికి కరోనా
  • కరోనా నుంచి కోలుకున్న 97 మంది
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,081  
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 130 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో విశాఖ జిల్లాలో అత్యధికంగా 30 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. గత 24 గంటల్లో 97 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,76,979కి చేరింది. ఇప్పటి వరకు 20,61,405 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 14,493 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,081 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


More Telugu News

Andhra Pradesh Corona Virus Updates