Kalyandev: ఆగదు ఈ అన్వేషణ ఒక ప్రాణం తీసేంతవరకూ .. 'కిన్నెరసాని' ట్రైలర్ రిలీజ్!

Kinnerasani Trailer Released
  • కల్యాణ్ దేవ్ హీరోగా 'కిన్నెరసాని'
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ 
  • దర్శకుడిగా రమణతేజ 
  • జనవరి 26వ తేదీన రిలీజ్  
కల్యాణ్ దేవ్ హీరోగా రమణతేజ దర్శకత్వంలో 'కిన్నెరసాని' సినిమా రూపొందింది. రజని తాళ్లూరి - రవి చింతల నిర్మించిన ఈ సినిమా, కొంతకాలం క్రితమే విడుదలకు ముస్తాబైంది. అయితే పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తూ వచ్చింది. తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. జనవరి 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. "నీ ముందున్న సముద్రపు అలలను చూడు .. కోపగించుకుని సముద్రాన్ని వదిలి వెళ్లిపోతున్నట్టుగా ఉన్నాయి. కానీ సముద్రం వాటిని వదలదు .. వదులుకోలేదు .. నేను కూడా అంతే" అనే ఫీల్ తో కూడిన డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలైంది.

 కారణం లేని ప్రేమ .. గమ్యం లేని ప్రయాణం చాలా గొప్పవి కదా. ఆగదు ఈ అన్వేషణ ఒక ప్రాణాన్ని తీసేవరకూ వంటి డైలాగ్స్ ఉత్కంఠను పెంచుతున్నాయి. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ ను టచ్ చేస్తూ వదిలిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాతో కొత్త కథానాయిక పరిచయమవుతోంది.
Kalyandev
Annsheetal
Ramanateja
Kinnerasani Movie

More Telugu News