Molnupiravir: మోల్ను పిరావిర్ చికిత్సా వ్యయం రూ.3,000!

Molnupiravir treatment likely to cost up to Rs 3000
  • 200 ఎంజీ డోసేజీలో మార్కెట్లోకి
  • ఉదయం, సాయంత్రం 800 డోసేజీ తీసుకోవాలి
  • వచ్చే వారమే అందుబాటులోకి 
కరోనా చికిత్సలో మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతున్న మోల్నుపిరావిర్ ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఫార్మా కంపెనీలు పోటీపడుతున్నాయి. 13 కంపెనీలు ఈ ఔషధాన్ని తయారు చేయనున్నాయి. ఇప్పటికే సన్ ఫార్మాకు అనుమతి లభించగా మరికొన్ని కంపెనీలు ఔషధ నియంత్రణ మండలికి దరఖాస్తు పెట్టుకున్నాయి.

మోల్నుపిరావిర్ ఔషధాన్ని 800 ఎంజీ డోసేజీతో రోజుకు రెండు సార్లు (ఉదయం, సాయంత్రం) ఐదు రోజులు వాడాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.2,000 నుంచి రూ.3,000 వరకు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా. కంపెనీలు 200 ఎంజీ క్యాప్సుల్స్ ను విడుదల చేయనున్నాయి. మొత్తం 40 క్యాప్సుల్స్ ను తీసుకోవాల్సి ఉంటుంది.

నాట్కో ఫార్మా, జేబీ కెమికల్స్, హెటెరో డ్రగ్స్, మ్యాన్ కైండ్ ఫార్మా, వాట్రిస్, సన్ ఫార్మా నుంచి ఈ ఔషధం వచ్చే వారంలో మార్కెట్లోకి రావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వైద్యుల సూచన మేరకు ఈ ఔషధాలను విక్రయించనున్నారు. కరోనా వచ్చిన వెంటనే ఐదు రోజులు ఈ ఔషధాన్ని తీసుకున్న వారు చక్కగా కోలుకున్నట్టు, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని నివారిస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది.
Molnupiravir
corona drug
release

More Telugu News