V.Srinivasa Rao: ఏపీలో సీపీఎం కొత్త కార్యవర్గం ఎన్నిక... రాష్ట్ర కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు

V Srinivasa Rao elected as CPM AP new secretary
  • తాడేపల్లిలో మూడ్రోజులుగా సీపీఎం రాష్ట్ర మహాసభలు
  • నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన పార్టీ
  • 50 మందితో నూతన కార్యవర్గం
  • పి.మధుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా కమిటీలో స్థానం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో గత మూడ్రోజులుగా జరుగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభలు నేటితో ముగిశాయి. ఈ సమావేశాల్లో ఏపీకి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సీపీఎం ఏపీ కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. మొత్తం 50 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని పార్టీ నేడు ప్రకటించింది.

కాగా, ఇప్పటివరకు రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన పి.మధుకు నూతన కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానం కల్పించారు. రాష్ట్రంలో సీపీఎం కొత్త కార్యవర్గం ఏర్పాటైన నేపథ్యంలో ఆ పార్టీ హైకమాండ్ విప్లవాభినందనలు తెలిపింది.
V.Srinivasa Rao
State Secretary
CPM
Andhra Pradesh

More Telugu News