Sukumar: 'పుష్ప' సినిమా చూడాలంటూ గవర్నర్ తమిళిసైని కోరిన దర్శకుడు సుకుమార్

Sukumar invites Telangana Governor Tamilisai to watch Pushpa movie
  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 'పుష్ప' చిత్రం
  • ఈ నెల 17న విడుదలైన సినిమా 
  • వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లు
  • రాజ్ భవన్ కు వెళ్లిన సుకుమార్, అల్లు అరవింద్
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా, 'పుష్ప' దర్శకుడు సుకుమార్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నేడు తెలంగాణ రాజ్ భవన్ కు వెళ్లి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. 'పుష్ప' సినిమా చూడాలంటూ దర్శకుడు సుకుమార్ గవర్నర్ తమిళిసైని కోరారు.

దీనిపై సుకుమార్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. గవర్నర్ తో సినిమా టికెట్ల వ్యవహారంపై ఏమైనా చర్చించారా? అని అడగ్గా... అలాంటిదేమీ లేదని, 'పుష్ప' సినిమా చూసేందుకు రావాలని ఆహ్వానించామని సుకుమార్ తెలిపారు. 
Sukumar
Tamilisai Soundararajan
Governor
Pushpa
Allu Aravind
Telangana
Tollywood

More Telugu News