Raviteja: 'ఖిలాడి'కి గుమ్మడికాయ కొట్టేస్తారట!

Khiladi movie update
  • 'ఖిలాడి'గా రవితేజ 
  • దర్శకుడిగా రమేశ్ వర్మ 
  • ఈ నెల 31న మూడో సింగిల్ 
  • ఫిబ్రవరి 11న సినిమా రిలీజ్  
రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందుతోంది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ దిశగానే అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.

ఈ పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగు పార్టు మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. త్వరలో గుమ్మడికాయ కొట్టేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకు వదిలిన రెండు సింగిల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూడో సింగిల్ ను ఈ నెల 31వ తేదీన వదలనున్నారు.

భారీతారాగణం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి అందాల సందడి చేయనున్నారు. కీలకమైన పాత్రల్లో అర్జున్ .. సచిన్ ఖేడ్కర్ .. ముఖేశ్ రుషి కనిపించనున్నారు. రావు రమేశ్ .. ఉన్ని ముకుందన్ .. మురళీ శర్మ .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
Raviteja
Meenakshi
Dimple Hayathi
Khiladi Movie

More Telugu News