Revanth Reddy: కొత్త జోనల్ విధానం కొందరికి వరంలా, కొందరికి శాపంలా మారింది: సీఎం కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

Revanth Reddy shot a letter to CM KCR on new zonal system
  • తెలంగాణలో జోనల్ విధానం
  • జీవో నెం.317ని ఉపసంహరించుకోవాలన్న రేవంత్
  • స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్
  • ఉద్యోగులతో చర్చించాకే నూతన మార్గదర్శకాలు రూపొందించాలన్న రేవంత్ 
కొత్త జోనల్ విధానం నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికి వరంలా, కొందరికి శాపంలా మారిందని పేర్కొన్నారు. ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్త జిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోవడంలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గదర్శకాలను రద్దు చేయాలని, ఉద్యోగులతో చర్చించిన తర్వాతే నూతన మార్గదర్శకాలు రూపొందించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.317ని ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు.
Revanth Reddy
CM KCR
Open Letter
New Zonal System
Employees
Telangana

More Telugu News