Ajith: 'బలం' టైటిల్ తో రంగంలోకి అజిత్ 'వలిమై'

valimai movie update
  • అజిత్ తాజా చిత్రంగా 'వలిమై'
  • కథానాయికగా హుమా ఖురేషి 
  • ప్రతినాయకుడిగా కార్తికేయ 
  • జనవరి 13వ తేదీన విడుదల
తమిళనాట అజిత్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనకి అక్కడ మాస్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంది. అలాంటి అజిత్ కొంతకాలంగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఆయన తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదలయ్యేలా చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఆయన తాజా చిత్రమైన 'వలిమై' కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సినిమాకి తెలుగులో 'బలం' అనే టైటిల్ ను నిర్ణయించారు. తమిళంతో పాటు తెలుగులోనూ జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదలనున్నట్టుగా తెలుస్తోంది.

బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి వినోద్ దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ  సినిమాలో, కథానాయికగా హుమా ఖురేషి కనిపించనుంది. తెలుగులో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమా ఆయనకి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.
Ajith
Huma Qureshi
Karthikeya
Valimai Movie

More Telugu News