Rajinikanth: 'సూపర్-100' బ్యాచ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన తలైవా 'రజనీకాంత్ ఫౌండేషన్'

Rajinikanth foundation starts super hundred batch registrations
  • ఇటీవల రజనీకాంత్ పుట్టినరోజు
  • నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చే కార్యాచరణపై ప్రకటన
  • సూపర్-100 బ్యాచ్ ఏర్పాటు
  • పేద విద్యార్థులకు పూర్తి ఉచితంగా శిక్షణ
రాజకీయ పార్టీ స్థాపించాలన్న ఆలోచనను పూర్తిగా విరమించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తన రజనీకాంత్ ఫౌండేషన్ ద్వారా యువతకు చేయూతనిచ్చేందుకు తలైవా కొత్త కార్యాచరణకు తెరదీశారు. త్వరలో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్ఎస్పీఎస్ సీ) నిర్వహించే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు పోటీపడే యువతీయువకులకు రజనీకాంత్ ఫౌండేషన్ మెరుగైన శిక్షణ ఇవ్వనుంది. అందుకోసం సూపర్-100 బ్యాచ్ పేరిట ప్రత్యేక విధానం రూపొందించారు.

100 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం అని రజనీకాంత్ ఫౌండేషన్ వెల్లడించింది. ప్రస్తుతం సూపర్-100 బ్యాచ్ కు రిజిస్ట్రేషన్లు చేపట్టారు. ఇటీవల (డిసెంబరు 12) తన పుట్టిన రోజు సందర్భంగా రజనీకాంత్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించారు.
Rajinikanth
Super-100
Foundation
TNSPSC
Tamilnadu

More Telugu News