Perni Nani: హీరోలు నాని, సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందన

AP Minister Perni Nani replies to Heroes Nani and Siddarth
  • రగులుతున్న సినిమా టికెట్ల వ్యవహారం
  • థియేటర్ల కంటే కిరాణా కొట్లకే ఆదాయం వస్తోందన్న నాని
  • ఏపీ మంత్రులు లగ్జరీగా బతుకుతున్నారని సిద్ధార్థ్ వ్యాఖ్యలు
  • నాని ఏ కొట్లో లెక్కలు చూశాడంటూ పేర్ని నాని సెటైర్
  • సిద్ధార్థ్ కు ఈ రాష్ట్రంతో ఏం సంబంధమంటూ కౌంటర్
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం టాలీవుడ్ ప్రముఖులు వర్సెస్ వైసీపీ నేతలు అన్నట్టుగా తయారైంది. ఇటీవల హీరో నాని స్పందిస్తూ, థియేటర్ల కలెక్షన్ల కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్లకే వసూళ్లు ఎక్కువగా వస్తున్నాయని వ్యాఖ్యానించారు. మరో హీరో సిద్ధార్థ్ మరింత ఘాటుగా స్పందిస్తూ, తాము కట్టే పన్నులతో ఏపీ మంత్రులు లగ్జరీగా బతుకుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేశాడు.

ఈ వ్యాఖ్యలపై నేడు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. హీరో నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు చూసి వ్యాఖ్యానించారో, ఏ కిరాణా కొట్టు కలెక్షన్లు నాని దృష్టికి వచ్చాయో తనకు తెలియదని పేర్కొన్నారు.

సిద్థార్థ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... "రాజకీయనేతలు విలాసవంతంగా బతుకుతున్నారని హీరో సిద్ధార్థ్ అంటున్నారు. అయినా సిద్ధార్థ్ ఎక్కడ ఉంటున్నాడు? తమిళనాడులో! ఏపీతో ఆయనకేంటి సంబంధం? ఈ రాష్ట్రంలో ఆయన చెల్లించే ట్యాక్సులు ఏమున్నాయి? మేం ఏవిధంగా బతుకుతున్నామో సిద్ధార్థ్ కు ఏంతెలుసు?" అంటూ ప్రశ్నించారు.
Perni Nani
Nani
Siddarth
Cinema Tickets
Theaters
Andhra Pradesh
Tollywood

More Telugu News