Congress: కాంగ్రెస్ కార్యక్రమంలో అపశ్రుతి.. సోనియా చేతులలో పడిన జెండా

Congress flag falls off while being hoisted by partys interim president Sonia Gandhi
  • ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ 137వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ వేడుక
  • కాంగ్రెస్‌ జెండాను స‌రిగ్గా క‌ట్ట‌ని వైనం
  • మ‌ళ్లీ తాడుకి క‌ట్టి ఎగ‌రేసిన కాంగ్రెస్ నేత‌లు
కాంగ్రెస్‌ పార్టీ 137వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ వేడుక‌లను ఢిల్లీలోని ఆ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ జెండా ఎగ‌రేస్తోన్న స‌మ‌యంలో అది స‌రిగ్గా ఎగ‌ర‌లేదు.

 అనంత‌రం ఓ వ్య‌క్తి సోనియాకు సాయం చేయ‌బోయారు. ఇంత‌లో ఆ జెండా ఊడిపోయి పై నుంచి వ‌చ్చి సోనియా చేతుల్లో పడింది. దీంతో ఆ జెండాను మ‌ళ్లీ తాడుకి క‌ట్టి ఎగ‌రేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

కాగా, కాంగ్రెస్ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని పార్టీ నేత‌లు దేశ వ్యాప్తంగా జ‌రుపుకుంటున్నారు. ఢిల్లీలో నిర్వ‌హించిన వేడుక‌ల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. త‌మ పార్టీ నేత‌లు దేశానికి చేసిన సేవ‌లను కాంగ్రెస్ నేత‌లు గుర్తు చేసుకున్నారు.
Congress
Sonia Gandhi
Rahul Gandhi
New Delhi

More Telugu News