Gorantla Butchaiah Chowdary: సినిమా టికెట్ల విషయంలో ఎందుకు అత్యుత్సాహం?: గోరంట్ల

gorantla fires on ycp
  • అందరూ 2 రూపాయలకే న్యూస్ పేపర్ ఇవ్వాల‌ని అప్పుడు వైసీపీ పేర్కొంది
  • ఇప్పుడు సాక్షి పేపర్ 1 రూపాయికి ఇవ్వగలరా?
  • సినిమా టికెట్లు మాత్రం తక్కువ ధ‌ర‌కు ఎందుకు అమ్మాలి?
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల వ్య‌వ‌హారంపై వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా టికెట్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని టీడీపీ నేత‌ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప్ర‌శ్నించారు. సొంత వ్యాపారం అయితే ఇలా ధ‌ర‌లు త‌గ్గించ‌గ‌ల‌రా? అని ఆయ‌న వైసీపీ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు.

'సాక్షి పత్రిక స్థాపించి.. అందరిని 2 రూపాయలకే న్యూస్ పేపర్ ఇమ్మని చెప్పిన వాళ్లు ఇప్పుడు సాక్షి పేపర్ 1 రూపాయకి ఇవ్వగలరా? కనీసం ఇసుమంత అయినా మనస్సాక్షి లేని సాక్షి రాతల‌కు రూ.5 పెట్టి కొనాలి. సినిమా టికెట్లు మాత్రం తక్కువ చేసి అమ్మాలి. సినిమా టికెట్ల విషయంలో ప్ర‌భుత్వానికి ఎందుకు అత్యుత్సాహం?' అని ఆయ‌న నిల‌దీశారు.
Gorantla Butchaiah Chowdary
Telugudesam
Tollywood

More Telugu News